చెన్నూర్ కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి మేనిఫెస్టో

చెన్నూర్ కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి మేనిఫెస్టో

చెన్నూర్​, వెలుగు: చెన్నూర్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ను గెలిపిస్తే సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు స్థాపించి యువతకు 40వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్  జి.వివేక్  వెంకటస్వామి హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తానని, నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తానని  పేర్కొన్నారు.  

యువతకు..

  •     సింగరేణిలో అనుబంధ పరిశ్రమల స్థాపన ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు
  •     చెన్నూర్​లో మైనింగ్  ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు 
  •     మందమర్రి, జైపూర్​, చెన్నూర్​లో  మూడు స్కిల్ డెవలప్ మెంట్​ సెంటర్లు
  •     సిరామిక్  టైల్స్  ఇండస్ట్రీ అభివృద్ధి 
  •     చెన్నూర్​లో అగ్రికల్చర్​ మినీ యూనివర్సిటీ ఏర్పాటు 
  •     కొత్త వంగడాల అభివృద్ధి కోసం అగ్రి రీసెర్చ్ సెంటర్​ 
  •     సింగరేణి ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టులు, జైపూర్​ థర్మల్​ పవర్​ ప్లాంట్లో భూనిర్వాసితులు, స్థానిక యువతకే కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ జాబ్స్​

సింగరేణి కార్మికులకు..

  •     కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ.15 లక్షల వడ్డీ లేని లోన్
  •      మందమర్రి, రామకృష్ణాపూర్  ఏరియాలో 100 బెడ్స్  సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్  ఏర్పాటు
  •      సింగరేణి నుంచి మెడికల్  రెఫరల్ కేసులు నేరుగా హైదరాబాద్​ వెళ్లడానికి చర్యలు 
  •      కార్మికులు చెల్లిస్తున్న ఇన్​కమ్​టాక్స్, ​సింగరేణి నుంచి రీయింబర్స్​మెంట్
  •      సింగరేణి జాగాల్లో నివాసం ఉంటున్న వారికి పూర్తిస్థాయిలో పట్టాల పంపిణీ.. ఖాళీ క్వార్టర్లను రిటైర్డ్​ కార్మికులకు కేటాయింపు
  •     సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం

మౌలిక వసతులు..

  •     నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు, అన్ని గ్రామాల్లో మిషన్​ భగీరథ కంటే మెరుగైన వాటర్​ సప్లై స్కీమ్​లు
  •     అన్ని గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో నియోజకవర్గ కేంద్రంతో అనుసంధానం
  •     వివేక్​ ఎంపీగా ఉన్నప్పుడు రూ.38 కోట్లతో పాటు  శాంక్షన్​ చేసిన క్యాతన్​పల్లి ఆర్వోబీ పెండింగ్​ పనుల పూర్తి 
  •     కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ముంపు సమస్యకు 
  •    పరిష్కారం..  అవసరమైతే గోదావరికి కరకట్టల నిర్మాణం