కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాణిక్ రావు థాక్రే భేటీ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాణిక్ రావు థాక్రే భేటీ

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతో భేటీ అయ్యారు. నిన్న కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పై థాక్రే వివరణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు కోమటిరెడ్డి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను థాక్రే క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని భారత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ లో పాదయాత్ర చేస్తుండగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే పొత్తు విషయాలను ఎందుకు మాట్లాడారనే దానిపై తాజాగా కోమటిరెడ్డి నుంచి థాక్రే వివరణ కోరనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి వ్యాఖ్యల అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ థాక్రేపై ఒత్తిడి పెరిగింది. చర్చల అనంతరం కోమటిరెడ్డి ఇచ్చిన రిపోర్టును థాక్రే ఏఐసీసీకి సమర్పించనున్నారు.