నవంబర్ 24న రాష్ట్రానికి త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్

నవంబర్ 24న  రాష్ట్రానికి త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
  • మూడ్రోజుల పాటు సీపీఎం తరఫున ప్రచారం 

హైదరాబాద్, వెలుగు: సీపీఎం అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అగ్రనేతలు  రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం త్రిపుర మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్ తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో  పాల్గొననున్నారు. 24న ఖమ్మంలో రోడ్ షోలో, మధిర సెగ్మెంట్ లో నిర్వహించే బహిరంగసభలో మాణిక్ సర్కార్ పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర నేత బాబురావు తెలిపారు.

25న ఉదయం భద్రాచలం సెగ్మెంట్ లోని వాజేడులో జరిగే సభలో, సాయంత్రం భద్రాచలంలో రోడ్ షోలో పాల్గొంటారని చెప్పారు.26న పాలేరు సెగ్మెంట్లోని కూసుమంచిలో ప్రచారం చేస్తారని వివరించారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషినీ అలీ శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జనగామ సెగ్మెంట్ లో, సాయంత్రం హైదరాబాద్​లోని ముషీరాబాద్ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బాబురావు పేర్కొన్నారు.