వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన మణికొండ మున్సిపల్​ కార్మికులు

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన మణికొండ మున్సిపల్​ కార్మికులు

రంగారెడ్డి జిల్లా : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ ఏరియా పందం వాగులో పడి కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కాపాడారు. మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు వాగు వద్దకు చేరుకొని..  దాదాపు గంట పాటు శ్రమించి వాగు గోతిలో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న వ్యక్తిని కాపాడారు. అతడిని బయటకు తీసి స్నానం చేయించి భోజనం తినిపించారు. పారిశుధ్య కార్మికుల ధైర్య సాహసాలను స్థానిక ప్రజలు అభినందించారు.