ఇయ్యాల హైదరాబాద్‌‌కు  మాణిక్‌‌రావ్​ ఠాక్రే

ఇయ్యాల హైదరాబాద్‌‌కు  మాణిక్‌‌రావ్​ ఠాక్రే

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ మాణిక్ రావ్​ ఠాక్రే గురువారం హైదరాబాద్‌‌కు రానున్నారు. సాయంత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌‌చార్జ్ సెక్రటరీలతో భేటీ కానున్నారు. శుక్రవారం కాంగ్రెస్ మత్స్యకార విభాగం చైర్మన్, జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, యూత్ కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారు. శనివారం ఉదయం కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం..‌‌అంబర్‌‌పేటలో నిర్వహిస్తున్న అండర్ 19 క్రికెట్ చాంపియన్‌‌షిప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం వెళ్లి పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటారు. సోమవారం ఉదయం‌‌ తిరిగి నాగ్‌‌పూర్ వెళ్తారు.