V6 News

ఆ నీచాతి నీచుడు వీడే : మహిళను నగ్నం కొట్టుకుంటూ తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

ఆ నీచాతి నీచుడు వీడే : మహిళను నగ్నం కొట్టుకుంటూ తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

మణిపూర్ ఘటనపై  ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ స్పందించారు.ఇద్దరు  మహిళలను , నలుగురు పురుషులను ఘోరంగా అవమానించిన  వీడియో వైరల్ కావడంతో మణిపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనను నిరసిస్తూ   ఆదివాసీ గిరిజిన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) గురువారం (జులై20) కవాతు నిర్వహించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ (32) ను అరెస్ట్ చేశారు. 

ఈ అవమానకర ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ .. మణిపూర్ ఘటన ఏ సమాజానికైనా అవమానకరమని.. తన హృదయం బాధ, కోపంతో రగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  మణిపూర్ మహిళలను ఘోరంగా అవమానించిన వారిని క్షమించమని.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని తెలిపారు.  ఈ సిగ్గుచేటు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, "మణిపూర్ ఘటన ఏ సమాజానికైనా అవమానకరం, నా హృదయం బాధతో, కోపంతో నిండిపోయింది. మణిపూర్ కుమార్తెలకు జరిగిన దాన్ని ఎప్పటికీ క్షమించలేము, దోషులను విడిచిపెట్టలేము" అని అన్నారు.

ఇదిలావుండగా ఇద్దరు మహిళలపై ఇటీవల వైరల్ అయిన వీడియోపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో మాట్లాడారు.  మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కూడా ట్వీట్ చేస్తూ, ఈ కేసును  సుమోటోగా  తీసుకున్నామని ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని  ప్రధాని నరేంద్ర మోదీకి, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌,  కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు.