మణిపూర్ హింసాకాండలో142 మంది మృతి

మణిపూర్ హింసాకాండలో142 మంది మృతి

సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం

ఇంఫాల్ : మణిపూర్ లో రెండు నెలల క్రితం మొదలైన హింసాకాండలో ఇప్పటివరకు 142 మంది మృతిచెందారని ఆ రాష్ట్ర సర్కారు తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదికను జులై 10న సుప్రీంకోర్టుకు సమర్పించింది. రాష్ట్రంలో మైతీ తెగను షెడ్యూల్ కులాల్లో చేర్చడంపై కుకీలు నిరసన ప్రదర్శన ప్రారంభించారు. ఈ నిరసనలు హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినీత్​ జోషి మాట్లాడుతూ.. స్టేట్​లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో ఇప్పటి వరకు 5,995 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 6,745 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.