సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్...  నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలో సిసోడియా సవాలును అత్యవసర విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ రోజు ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చూసి బీజేపీ భయపడుతోందని, తనను అరెస్టు చేసినా భయపడేదేలేదని సిసోడియా స్పష్టం చేశారు.