Manish Sisodia : ప్రధాని మోడీకి సిసోడియా లేఖ

Manish Sisodia  : ప్రధాని మోడీకి సిసోడియా లేఖ

ప్రధాని నరేంద్ర  మోడీకి ఆప్ నేత, మాజీ మంత్రి సిసోడియా తీహార్ జైలు నుండి  లేఖ రాశారు. సిసోడియా లేఖ కాపీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.  దేశ ప్రగతికి చదువుకున్న వ్యక్తి ప్రధాని కావాలని తన లేఖలో పేర్కొన్నారు. మోడీకి సైన్స్ అర్థంకాదని, చదువుకున్న  ప్రాధాన్యత అర్థంకాదని తన లేఖలో పేర్కొన్నారు.  గత కొన్నేళ్లుగా 60 వేల స్కూళ్లు మూతపడ్డాయనని తన లేఖలో ప్రస్తావించారు.

దేశం పురోగమించాలంటే విద్యావంతులైన ప్రధాని అవసరమని సిసోడియా అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి విద్యార్హత లేకపోవడం దేశానికి ప్రమాదమని ఆరోపించారు. మోడీ తన సర్టిఫికెట్లను  బహిర్గతం చేయాలని సిసోడియా డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  ఫిబ్రవరి 26న  సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.

https://twitter.com/ArvindKejriwal/status/1644191988806455296