న్యూఢిల్లీ: ఇండియా స్టార్ రెజ్లర్లు మనీషా, నేహా.. ఉలెన్‌బాటర్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్‌లో స్వర్ణ పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన విమెన్స్ 57 కేజీల ఫైనల్లో మనీషా 3–1తో సిమ్ సన్ (నార్త్ కొరియా)పై గెలిచింది. 59 కేజీల టైటిల్ బౌట్‌లో 5–3తో ప్యోల్ హాంగ్ (నార్త్ కొరియా)ను ఓడించింది. 50 కేజీల బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ బౌట్‌లో నీలమ్ 10–0తో మరల్ తంగిర్‌బెర్గెనోవ్ (కజకిస్తాన్)పై నెగ్గింది. మెన్స్ 87 కేజీల్లో సునీల్ 4–1తో అజాద్ సాలిడినోన్‌పై,97 కేజీల్లో నితేష్ 13–9తో నురాసిల్ అమనలీపై నెగ్గి స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.
