మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో

మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో

రీసెంట్‌‌గా మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రం సూపర్ సక్సెస్‌‌ను అందుకుంది. ఇప్పుడీ ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్  సంస్థ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.  2006లో కొడైకెనాల్‌‌లోని గుణకేవ్‌‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల రియల్‌‌ లైఫ్‌‌ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రూ.200 కోట్లు వసూలు చేసిన మొదటి మలయాళ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.  చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.