ఆల్టోను సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ కారుగా మార్చిన టెకీ

ఆల్టోను సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ కారుగా మార్చిన టెకీ
  • రెడ్‌‌‌‌‌‌‌‌మీ నోట్‌‌‌‌‌‌‌‌ 9 ప్రో,  ఫ్లోపైలెట్‌‌‌‌‌‌‌‌, ఓపెన్ సోర్స్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో పని పూర్తి చేశానని వెల్లడి

న్యూఢిల్లీ :  బెంగళూరుకి చెందిన ఓ టెకీ  మారుతి ఆల్టో కే10 ను సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ కారుగా మార్చారు. డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా హైవే పైన వెళుతున్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో హల్‌‌‌‌‌‌‌‌ చల్ చేస్తోంది. మారుతి ఆల్టో కే10 ను సెకెండ్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌ రెడ్‌‌‌‌‌‌‌‌మీ నోట్‌‌‌‌‌‌‌‌ 9 ప్రో, ఫ్లో ఫైలెట్‌‌‌‌‌‌‌‌, ఓపెన్ సోర్స్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో  అటానమస్‌‌‌‌‌‌‌‌  కారుగా మార్చానని మన్కరన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌  ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కోమా డాట్ ఏఐ ఓపెన్‌‌‌‌‌‌‌‌పైలెట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫ్లోపైలెట్‌‌‌‌‌‌‌‌ వచ్చింది.

దీని ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ హాట్జ్‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌గా తీసుకొని ఈ  సెల్ఫ్ డ్రైవింగ్ కారును డెవలప్ చేశానని చెప్పారు. సింగ్  ఒక పోగ్రామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గేమింగ్‌‌‌‌‌‌‌‌, యాప్స్ డెవలప్ చేస్తున్నారు.  ఫ్లో డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌పై పనిచేస్తున్నారు. ఫోన్ క్వాలిటీ బట్టి ఫ్లోపైలెట్‌‌‌‌‌‌‌‌  పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుందని, మిడ్‌‌‌‌‌‌‌‌ రేంజ్ ఫోన్లతో మంచి పెర్ఫార్మెన్స్ సాధించొచ్చని సింగ్ వెల్లడించారు.  ఫ్లోపైలెట్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 200 కార్ల మోడల్స్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్ చేస్తోంది. కానీ,  ఇండియాలోని కార్లకు మాత్రం ప్రస్తుతానికి సపోర్ట్ చేయడం లేదు. క్రియేటివిటీతో ఇండియన్ కార్లకు సరిపోయేలా సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడగలిగారు. ఫ్లోపైలెట్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేసేవి  కేవలం హైవేల్లో మాత్రమే నడుస్తాయి. బిజీ రోడ్లలో కష్టం.