మ్యాన్ కైండ్ చేతికి రివోట్రిల్ బ్రాండ్

మ్యాన్ కైండ్ చేతికి రివోట్రిల్ బ్రాండ్

న్యూఢిల్లీ: మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీ, రోష్ సంస్థ నుంచి రివోట్రిల్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. భారతదేశంలో ఈ మందు ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ చేయడానికి ప్రత్యేక హక్కులు పొందింది. క్లోనాజెపామ్ లో రివోట్రిల్ ఒక ప్రముఖ బ్రాండ్. దీనిని ప్రధానంగా నరాల సమస్యలు, మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. 

దీర్ఘకాలిక వ్యాధుల విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా సీఎన్​ఎస్ థెరపీ విభాగంలో రోగులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని  పేర్కొంది.