మోదీలా ఏ ప్రధాని ద్వేష పూరిత ప్రసంగాలు చేయలేదు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

మోదీలా ఏ ప్రధాని ద్వేష పూరిత ప్రసంగాలు చేయలేదు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ప్రధాని మోదీ ప్రసంగాలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు. మోదీ ద్వేషపూరిత, అన్ పార్లమెంటరీ ప్రసంగాలు చేయడం సరికాదన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇలాంటి ప్రసంగాలు చేయలేదన్నారు. ఓ వర్గాన్ని, ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని ద్వేషపూరిత, అన్ పార్లమెంటరీ ప్రసంగాలు చేస్తూ ప్రధాన మంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆరోపించారు. 

ఏప్రిల్ లో రాజస్థాన్ లోని జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతుందని ఆరోపించిన తర్వాత మన్మోహన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వనరులపై తొలి హక్కు ముస్లింలదేనన్న మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఉదాహరణగా చెప్పారు. 

జూన్ 1 న పంజాబ్ లో ఎన్నికలు జరుగునున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రజలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ .. ప్రధానిమోదీ విద్వేషపూరిత ప్రసంగాల్లో ఉన్న దుర్మార్గపు ఆలోచన ఉందని.. ఇది విభజించే స్వభావాన్ని కలిగి ఉన్నారని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. 

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీని ఏమైందని మన్మోహన్సింగ్ ప్రశ్నించారు. తన తర్వాత ప్రధానిగా వచ్చిన ప్రధాని మోదీ.. గడిచిన పదేళ్లల్లో రైతుల ఆదాయాన్ని దెబ్బతీశారని అన్నారు. 

రైతుల జాతీయ సగటు నెలవారి ఆదాయం  రోజుకు రూ.27 కంటే తక్కువగా ఉంది. అయితేరైతుకు సగటు అప్పు రూ. 27వేల ఉంది. ఇంధన, ఎరువులతో సహా ఇన్ ఫుట్ అధిక వ్యయం, 35 రకాల వ్యవసాయ సంబంధించిన పరికరాలపై జీఎస్టీ తో కలిపి ఉంటున్నారు.వ్యవసాయానికి సంబంధించిన ఎగుమతి, దిగుమతుల్లో ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం, వ్యవసాయం పై ఆధారపడిన కుటుంబాల పొదుపును నాశనం చేసిందన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. 

పంజాబ్ కు చెందిన 750 మంది రైతులు, ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి నిరీక్షిస్తూ చనిపోయారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్ లు సరిపోవన్నట్లుగా ప్రధాని మా రైతులపై మాటలతో దాడి చేశారని మన్మోహన్ సింగ్ విమర్శించారు.‘‘తమను సంప్రదించకుండా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనేది వారికి ఏకైక డిమాండ్.. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం.. పంజాబీలు, పంజాబియాత్ లను దూషించడంలో ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని ’’ మన్మోహన్ సింగ్ అన్నారు.