
న్యూఢిల్లీ: ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ హాస్పిటల్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారని, ఈ మేరకు ఆయన తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్‌సింగ్‌కు ఆదివారం రాత్రి ఛాతి నొప్పి రావడంతో ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ అందించారు. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.