అభివృద్ధి చేయలేక.. మత రాజకీయాలు

అభివృద్ధి చేయలేక.. మత రాజకీయాలు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. రాజస్థాన్ లోని జైపూర్ లో కాంగ్రెస్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహుల్.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఒకవేళ అప్పుడు ఇలా జరిగి ఉంటే మన్మోహన్ తన పదవికి రాజీనామా చేసి ఉండేవారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పైనా రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఆర్ఎస్ఎస్ విద్వేషాలను పెంచి పోషిస్తోందన్నారు. విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేయలేక, మత రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. రూల్స్ ఉల్లంఘిస్తే కేసులు తప్పవు

పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు

వద్దన్నా వేశారు.. అమ్మ ప్రాణం తీశారు