పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు

పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు

అమన్: పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాలు అందోళనకు దిగడమూ, సభ్యుల మధ్య వాగ్వాదాలూ కామనే. అయితే ఇదంతా ఒక పరిధిమేర ఉంటే బాగుంటుంది. కానీ, చట్టసభల హుందాను పెంచాల్సిన ప్రజాప్రతినిధులు మితిమీరి, విచక్షణ మరిచి ప్రవర్తిస్తే.. జోర్డాన్ పార్లమెంటులో అలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. ఒక అంశంపై చర్చ సందర్భంగా ఎంపీలు పరస్పర దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

సమాన హక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జోర్డాన్ పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ ఘటన సంభవించింది. ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఒకరినొకరు తోసుకోవడం, చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం స్థానిక మీడియా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది. అయితే ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం: 

టీకాలు తీసుకోని వారిలో కొవిడ్ ప్రభావం ఎక్కువ

బంగారు గని కూలి 38 మంది మృతి

హైనా హల్ చల్.. మూడు దూడలు మృతి