కరీంనగర్‌‌‌‌ ఫిలిగ్రీ గ్రేట్.. మన్‌‌‌‌ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

కరీంనగర్‌‌‌‌ ఫిలిగ్రీ గ్రేట్.. మన్‌‌‌‌ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
  • హైదరాబాద్‌‌‌‌కు చెందిన స్టార్టప్‌‌‌‌ సంస్థ స్కైరూట్ సేవలు భేష్​
  • ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా మన దేశానికుంది 
  • పరిశోధనా రంగంలో భారత్‌‌‌‌ దూసుకుపోతున్నదని వ్యాఖ్య

తెలంగాణలోని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్‌‌‌‌‌‌‌‌ ఫిలిగ్రీ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌పై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని మోదీ ప్రశంసలు కురిపించా రు. ప్రపంచం మన కళాకారుల ప్రతిభను గుర్తించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే జీ20 శిఖరాగ్ర సమావేశంలో దీన్ని ప్రోత్సహించేలా ప్రపంచ నేతలకు బహుమతులను అందించానని మోదీ చెప్పారు. జపాన్‌‌‌‌‌‌‌‌ ప్రధానికి వెండితో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని, ఇటలీ ప్రధానికి పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని కానుకగా ఇచ్చానని గుర్తుచేశారు. దేశ ప్రజలందరూ ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 

చంద్రయాన్‌‌‌‌‌‌‌‌–2 నింగితో సంబంధం తెగిపోయిన రోజు యావత్ దేశం నిరాశకు లోనైందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, ఆ వైఫల్యం మన సైంటిస్టులను ఆపలేకపోయిందని.. చంద్రయాన్‌‌‌‌‌‌‌‌–3 విజయగాథను వారు అదేరోజు నుంచి రచించడం మొదలుపెట్టారని ప్రశంసించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన స్టార్టప్‌‌‌‌‌‌‌‌ సంస్థ స్కైరూట్ పైనా  ప్రధాని ప్రశంసలు కురిపించారు. కాగా, ఇటీవల తాను భూటాన్‌‌‌‌‌‌‌‌ను సందర్శించానని, ఈ సమయంలో ఆ దేశ రాజు, మాజీ రాజుతోపాటు పలువురిని కలిశానని మోదీ చెప్పారు. అందరూ బుద్ధుడి పవిత్ర అవశేషాలను అక్కడికి పంపడాన్ని ప్రశింసిస్తున్నారని.. ఇది విన్నప్పుడు తన హృదయం ఆనందంతో నిండిపోయిందన్నారు.