
వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్. సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లతోనూ ఓటీటీలో మెప్పించిన మనోజ్.. ఇప్పుడు ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ చిత్రంతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ నెల 5 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ఇన్‌స్పెక్టర్ మధుకర్ బాపురావ్ జెండేగా మనోజ్ బాజ్‌పాయ్, కార్ల్ భోజరాజ్‌గా కుబేర విలన్ జిమ్ సర్బ్ నటించారు. ఇరవైకి పైగా హత్యలు చేసిన నొటోరియస్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా ఈ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు.
Inspector Zende is on duty soon. 🚨 Time's up for Interpol's most wanted 👀
— Netflix India (@NetflixIndia) August 22, 2025
Watch Inspector Zende, out 5 September, only on Netflix.#InspectorZendeOnNetflix pic.twitter.com/iwTMyb2PCL
ఈ మూవీ స్క్రిప్ట్ చదివినంత సేపు నవ్వాపుకోలేక పోయానని, తెరపై అంతకు మించిన నవ్వులు గ్యారంటీ అని మనోజ్ చెప్పారు. సీరియస్ సీన్స్‌ను కూడా కామెడీగా చూపిస్తూ ఇంటెన్స్‌తో తెరకెక్కించడం వల్ల ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎంగేజ్ చేస్తుందని ఆయన తెలిపారు.
చిన్మయ్ మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో పోలీసులు నటిస్తే రియలిస్టిక్‌గా ఉంటుందని కొందరు పోలీసులని సంప్రదించామని, కానీ వాళ్లు బిజీగా ఉన్నామని చెప్పారని ఓం రౌత్ ఈ సందర్భంగా తెలిపాడు.
ALSO READ : SSMB29: 120 దేశాల్లో మహేష్ బాబు 'SSMB29' విడుదల.. సరికొత్త రికార్డుకు రాజమౌళి సిద్ధం!
ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ‘రియల్ హీరో ఇన్‌స్పెక్టర్ జెండే’ గురించి మనోజ్ మాట్లాడారు. ‘‘ఇన్‌స్పెక్టర్ జెండేలో నన్ను ఆకర్షించిన విషయం ఏమిటంటే, అతను పేరు, ప్రఖ్యాతల కోసం అత్యంత డేంజరస్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ను పట్టుకోవాలని అనుకోలేదు. కేవలం తన పనిని నిజాయితీగా, నిబద్ధతగా నిర్వర్తించాడు అంతే. ఈ క్రమంలోనే రెండుసార్లు చార్లెస్ శోభరాజ్ని ఎంతో చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారని మనోజ్ చెప్పారు.
ఈ క్రమంలోనే అతని ధైర్యం, తనలోని హాస్యం మరియు క్లారిటీగా ఉండే మైండ్ సెట్.. ఇవన్నీ నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. అతనిని కలవడం జీవితాంతం చెప్పుకోదగ్గ కథలతో కూడిన కథల పుస్తకంలోకి అడుగుపెట్టినట్లు అనిపించిందని మనోజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.