Joram Movie OTT: ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సర్వైవల్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Joram Movie OTT: ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సర్వైవల్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‍పేయీ(Manoj Bajpayee) కీ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జోరమ్’(Joram). ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని దేవాశీశ్ మకీజా తెరకెక్కించారు. ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లేటెస్ట్గా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. 

ప్రస్తుతం జోరమ్ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో(Amazon Prime Video) హిందీలో స్ట్రీమ్ అవుతుంది.బట్ వన్ కండిషన్..ఈ సినిమాను రెంట‌ల్ విధానంలో మాత్ర‌మే అందుబాటులో ఉంచారు మేకర్స్.

ఈ సినిమా చూడాలంటే రూ.199 రెంట్‍తో చూడాల్సిందే. మరి ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్న కూడా చూడాలా? అనే డౌట్ వస్తుంది. అవును సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంతకాలం తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‍స్క్రైబర్లందరూ ఉచితంగా చూసేందుకు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఈ మూవీలో మహమ్మద్ జీషమ్ అయుబ్, స్మిత తాంబే, మేఘా మాథుర్, అపూర్వ డోంగర్వల్ కీలకపాత్రలు పోషించారు. మగేశ్ దక్డే సంగీతం అందించిన ఈ మూవీని జీ స్టూడియోస్ మరియు మఖీజా ఫిల్మ్స్ పతాకంపై షరీక్ పటేల్, అషిమా అవస్థి చౌదరీ, అనుపమ బోస్ మరియు దేవాన్శిశ్ మఖీజా నిర్మించారు.

రీసెంట్గా అనౌన్స్​ చేసిన ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులలో కూడా ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌), ఉత్తమ కథ కేట‌గిరీల‌లో అవార్డులను ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు 70వ సిడ్నీ ఫిల్మ్స్ ఫెస్టివల్, డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 28వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్, 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమై..మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు..ఆస్కార్ లైబ్రరీలోనూ పర్మినెంట్ కోర్ కలెక్షన్లలో జోరమ్ మూవీ చోటు దక్కించుకుంది.

జోరమ్ మూవీ కథేంటంటే?

జార్ఖండ్ రాష్ట్రం నుంచి ముంబై వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకునే దాస్రు కర్కెట్టా అలియాజ్ బాలా (మనోజ్ బాజ్‍పేయీ) భార్య ఒక ముఠా చేతిలో హత్యకు గురవుతుంది. వలస కార్మికుడిగా బ్రతికే మనోజ్ ఫ్యామిలీని..పూర్తిగా హతమార్చాలని ప్రయత్నించే వారి నుంచి తన పసిబిడ్డను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ.

ఇందులో మనోజ్ బాజ్‍పేయీ నటన అద్భుతంగా ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడంలో పలు సవాళ్లను ఎదుర్కోవడం..చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాకపోవడం..వంటి థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మరి ఆలస్యం ఎందుకు చూసేయండి.