
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ బడ్జెట్ తో తెరక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా.. దిగ్గజ నటులుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా దీని ఓటీటీ హక్కుల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం, ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ వంటి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు 'కన్నప్ప' డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ డీల్ కుదరడంలో మంచు విష్ణు కొన్ని కండీషన్లు పెట్టినట్లు సమాచారం.
ఓటీటీకి మంచు విష్ణు పెట్టిన కండీషన్స్..?
ముఖ్యంగా, ఈ సినిమాకు మంచి స్పందన వచ్చి, సూపర్ హిట్ అయితే మాత్రం థియేటర్లలో విడుదలైన కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మంచు విష్ణు నిబంధన పెట్టారని టాలీవుడ్ లో జోరుగు ప్రచారం జరుగుతుంది. ఇది సినిమా థియేట్రికల్ రన్‌కు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలనే తమ ఆలోచన అని పేర్కొన్నారు. ఒకవేళ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం, సాధారణంగా నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.. ఈ షరతులకు ప్లాట్‌ఫామ్‌లు సమ్మతించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే, 'కన్నప్ప'కు మంచి టాక్ వస్తే, ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి కొన్నాళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. కాబట్టి ఓటీటీ విషయంలో మంచు విష్ణు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని టాక్ వినిపిస్తోంది..
భారీ ధరకు హిందీ శాటిలైట్ హక్కులు ?
ఇప్పటికే 'కన్నప్ప' హిందీ శాటిలైట్ హక్కులు భారీ ధరకు (సుమారు రూ. 20 కోట్లు) అమ్ముడుపోయాయని సమాచారం. అయితే, ఓటీటీ హక్కుల డీల్ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మంచి ఆఫర్ వస్తేనే డీల్ క్లోజ్ చేస్తామని మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు. సినిమాకు వచ్చిన స్పందన, బడ్జెట్, భారీ తారాగణం కారణంగా 'కన్నప్ప' ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. మొత్తానికి, 'కన్నప్ప' ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుందనేది థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే స్పష్టమవుతుంది.
"కన్నప్ప" కేవలం మంచు విష్ణు సినిమా మాత్రమే కాదు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే, ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించి సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దారు. ఈ కాంబినేషన్లన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు గోల్డెన్ మైన్‌గా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ వంటి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు 'కన్నప్ప' డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎక్కువ ధరకు ఈ మూవీని దక్కించుకోనుందో వేచి చూడాలి మరి.