కోవిడ్ ఉధృతిపై మన్సుక్ మాండవీయ సమీక్ష

కోవిడ్ ఉధృతిపై మన్సుక్ మాండవీయ సమీక్ష

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఉన్నతాధికారులు, ఆరోగ్య నిపుణులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని..దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు.

టెస్టుల సంఖ్య పెంచి జీనోమ్ సీక్వెన్సీ, వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియజేయాలన్నారు. రాష్ట్రాల వారీగా కేసుల తీరుపై వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. పూర్తి జీనోమ్ సీక్వెన్సీపై దృష్టి సారించి ఏదైనా మ్యుటేషన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందేమో పరిశీలించాలన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజుల నుంచి 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, యూపీ, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి.