‘మను చరిత్ర’....ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్ 100 వైబ్స్ కనిపిస్తున్నాయి

‘మను చరిత్ర’....ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్ 100 వైబ్స్ కనిపిస్తున్నాయి

శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్స్. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్‌‌‌‌గా వచ్చిన హీరో  కార్తికేయ మాట్లాడుతూ ‘టీజర్, ట్రైలర్ చాలా హార్డ్ హిట్టింగ్‌‌‌‌గా ఉన్నాయి. ‘ఆర్ఎక్స్100’ విడుదలకు ముందు ఎలాంటి వైబ్స్ ఉండేవో ఇప్పుడు అలానే అనిపిస్తోంది.

టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నా’ అని అన్నాడు.  రక్షిత్ అట్లూరి, డైరెక్టర్ అజయ్ భూపతి, కొండా విజయ్, శేఖర్ రెడ్డి, బెక్కెం వేణుగోపాల్  సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. శివ కందుకూరి మాట్లాడుతూ ‘నన్ను కంప్లీట్ యాక్టర్‌‌‌‌‌‌‌‌ని చేసిన చిత్రమిది. ఎన్నో విషయాలు నేర్పింది. ఇంతమంచి స్ర్కిప్ట్‌‌‌‌ ఇచ్చిన భరత్‌‌‌‌కి థ్యాంక్స్. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ‘మను చరిత్ర’ చాలా స్వచ్ఛమైన కథ అన్నాడు భరత్. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నామన్నారు రాజ్ కందుకూరి. ప్రగతి శ్రీవాస్తవ్, గరిమ తదితరులు పాల్గొన్నారు.