ఈసారి దుస్తులకు గిరాకీ తక్కువే.. డిమాండ్​ 25 శాతం తగ్గే చాన్స్​

ఈసారి దుస్తులకు గిరాకీ తక్కువే.. డిమాండ్​ 25 శాతం తగ్గే చాన్స్​
  • ఎకానమీ నెమ్మదించడమే కారణం
  • పెరిగిన ధరలు వెల్లడించిన సీఎంఏఐ సర్వే

న్యూఢిల్లీ: ఈసారి పండుగ సీజన్​లో దుస్తుల(అప్పారెల్) అమ్మకాలు గత సంవత్సరంలో పోలిస్తే 25 శాతం తక్కువగా ఉండొచ్చని తయారీ సంస్థలు, రిటైలర్లు చెబుతున్నారు. దుస్తుల అమ్మకాల పోకడలు తెలుసుకోవడానికి క్లాతింగ్​ మానుఫాక్చరింగ్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (సీఎంఏఐ) చేసిన సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. ఇందుకోసం అసోసియేషన్​ 166 మానుఫాక్చరర్లను, బ్రాండ్లను సర్వే చేసింది.

వీరిలో 78 శాతం మంది రెస్పాండెంట్లు ఈసారి అమ్మకాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. కేవలం 25 శాతం మంది మాత్రం అమ్మకాల గురించి సానుకూలంగా మాట్లాడారు. ధరలు ఎక్కువగా ఉండటం, ఎకానమీ నెమ్మదించడం ఈ పరిస్థితికి కారణమని అసోసియేషన్​ తెలిపింది. అమ్మకాలు తగ్గడానికి ఎకానమీ నెమ్మదించడమే కారణమని 30 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. పదహారు శాతం మంది అభిప్రాయాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈసారి అమ్మకాలు పెరగొచ్చని వాదించారు. మనదేశంలో  సాధారణంగా అక్టోబరు–డిసెంబరు మధ్య పండుగ సీజన్​ ఉంటుంది.

ఈ సమయంలో గిరాకీని పెంచుకోవడానికి రిటైలర్లు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటారు. ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. "దాదాపు 49శాతం మంది రెస్పాండెంట్లు పిల్లల దుస్తుల వల్ల అమ్మకాల్లో పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అయితే 36శాతం మంది మహిళల దుస్తులకు డిమాండ్​ బాగుంటుందని  అన్నారు. కేవలం12శాతం మం ది పురుషుల దుస్తుల అమ్మకాలు బాగుంటాయని చెప్పారు. టైర్-–2,  టైర్–-3 నగరాలు  అమ్మకాల్లో మెట్రోలను అధిగమిస్తాయని అంచనా. దాదాపు 80శాతం మంది రెస్పాండెంట్లు ఈ వాదనను సమర్థించారు" అని సర్వే రిపోర్టు పేర్కొంది.

గత మూడు లేదా నాలుగు రోజులుగా కొంత సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పటికీ, సీఎంఏఐ సభ్యులలో నిరాశావాదమే ఎక్కువగా కనిపిస్తోందని అసోసియేషన్ చీఫ్ మెంటర్ రాహుల్ మెహతా అన్నారు. “ గత నాలుగైదు నెలల్లో దేశీయ గార్మెంట్ రంగంలో  మందగమనం కనిపిస్తోంది.   రాబోయే మ్యారేజ్​ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటే, దీపావళి తర్వాత మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.

పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మెరుగ్గా పనిచేస్తాయని 60శాతం మంది రెస్పాండెంట్లు భావిస్తున్నారు. అయితే 40శాతం మంది ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మెరుగ్గా పనిచేస్తాయని అన్నారు”అని మెహతా వివరించారు.