NISAR Mission Launch: భూపరిశీలనకు ఇస్రో ఉపగ్రహం..జూలైలో NISAR మిషన్ లాంచింగ్

NISAR Mission Launch: భూపరిశీలనకు ఇస్రో ఉపగ్రహం..జూలైలో NISAR మిషన్ లాంచింగ్

భూపరిశీలన శాటిలైట్ NISAR ను జూలై లో ప్రయోగించేందుకు సిద్దంగా ఉంది. నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ శాటిలైట్ ను అభివృద్ధి చేశాయి.నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్‌కు సంక్షిప్తంగా NISAR ను ఇస్రో అభివృద్ధి చేసిన GSLV మార్క్ II రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. జూలైలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి లిఫ్టాఫ్ చేయనున్నారు. 3టన్నుల బరువున్న ఈ శాటిలైట్, ప్రతి 12రోజులకొకసారి ఖచ్చితత్వంతో భూగ్రహాన్ని మ్యాప్ చేయనుంది. 

ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్

NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ,ISRO స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR..ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది L-బ్యాండ్ ,S-బ్యాండ్ SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌లను భూమికి పంపించనుంది. తిరిగి వాటి రాకను విశ్లేషించి మన గ్రహం పర్యావరణం గురించి అపూర్వమైన సమాచారాన్ని అందించనుంది. 

ఆప్టికల్ ఉపగ్రహాల మాదిరిగా కాకుండా NISAR చెట్ల పందిరి, ఉప నిర్మాణాలు, మేఘాలు, పొగ ,వృక్షసంపద ద్వారా కూడా చూడగలదు. ఇది పగలు ,రాత్రి, అన్ని వాతావరణంలో ఫొటోలను సేకరించే సామర్థ్యం కలిగి ఉంది.ఉపగ్రహ స్కాన్లు భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, నేల తేమ, హిమానీనదం కరగడం ,వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో సాయపడనుంది. 

NISAR భారత తీరప్రాంతాల నుండి డేటాను సేకరించనుంచి ,డెల్టాయిక్ ప్రాంతాల వెంట బాతిమెట్రీలో వార్షిక మార్పులను పరిశీలించనుంది. తీరప్రాంతం ,కోత పెరుగుదలను కూడా  ఇది అబ్జర్వ్ చేస్తుంది. NISAR మిషన్ భారతదేశ అంటార్కిటిక్ ధ్రువ కేంద్రాల చుట్టూ ఉన్న సముద్రాలపై సముద్రపు మంచు లక్షణాలను మరింత లోతుగా పరిశీలించనుంది. ఇవి సముద్ర చమురు చిందడాన్ని గుర్తించి నివారించేందుకు నివారణ చర్యలకు ఉపయోగపడుతుంది. 

రెండు వేర్వేరు పౌనపున్యాలతో పనిచేసే రెండు రాడార్లను మోసుకెళ్లే మొదటి ఉపగ్రహం కావడంతో NISAR మిషన్ రెండు అంతరిక్ష సంస్థల మధ్య భూమిని పరిశీలించే మిషన్ పై మొదటి హార్డ్ వేర్ సహకారాన్ని కూడా అందిస్తుంది. 

NISAR లో ప్రత్యేకత ఏంటంటే.. అధిక రెజల్యూషన్ ఫొటోలు, డేటా అందిస్తుంది. ఈ సేవలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు,ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి.
దీంతోపాటు NISAR కొన్ని మిల్లీమీటర్ల భూ కదలికను కొలవగల సామర్థ్యం టెక్టోనిక్ కదలికలు ,తీరప్రాంత కోతను ట్రాక్ చేయడానికి చాలా కీలకం. NISAR సేకరించిన డేటా భూగర్భజల వైవిధ్యం, అటవీ బయోమాస్ ఆనకట్టల సమగ్రత పరిశీలనకు సాయపడుతుందని, వాతావరణ శాస్త్రంతో పాటు విపత్తు నిర్వహణకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.