గత నెల నెమ్మదించిన తయారీ రంగం

గత నెల నెమ్మదించిన తయారీ రంగం

న్యూఢిల్లీ: తయారీ రంగం జోరు జులై నెలలో కొంత నెమ్మదించింది. ఇలా నెమ్మదించడం వరసగా రెండో నెల. ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ ఇండియా మాన్యుఫాక్చరింగ్​ పర్చేజింగ్​ మేనేజర్స్​ ఇండెక్స్​ (పీఎంఐ) జులై నెలలో కొద్దిగా తగ్గి 57.7 గా రికార్డయింది. జూన్​ 2023 లో ఈ పీఎంఐ 57.8 గా నమోదయింది. పీఎంఐ ఇండెక్స్​ కొద్దిగా తగ్గినప్పటికీ దేశంలో తయారీ రంగం గ్రోత్​ పటిష్టంగా కనిపిస్తోందని, డిమాండ్​ బలంగా ఉండటమే దీనికి కారణమని పీఎంఐ సర్వే తెలిపింది. ఓవరాల్​ ఆపరేటింగ్​ కండిషన్లు వరసగా 25 వ నెలలోనూ మెరుగుపడినట్లు జులై పీఎంఐ డేటా చెబుతోంది. 

పీఎంఐ 50 కి మించితే విస్తరిస్తున్నట్లు, అంతకు తగ్గితే కుచించుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. కొత్త ఆర్డర్ల పెరుగుదలతో జులైలో తయారీ రంగం మొమెంటమ్​ కొనసాగుతోందని ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ మార్కెట్​ ఇంటెలిజెన్స్​ ఎకనమిక్స్​ డైరెక్టర్​ ఆండ్రూ హార్కర్​ చెప్పారు. డిమాండ్​ నిలకడగా పెరిగితే, కొత్త ఉద్యోగాల కల్పన కూడా ఆ మేరకు పెరుగుతుందని పేర్కొన్నారు. గ్లోబల్​గా చూస్తే ఇండియా తయారీ రంగంలో ఒక  స్టార్​పెర్​ఫార్మర్​గా నిలుస్తోందని అన్నారు.