ఫైనల్లో ఇండియా టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ ప్లేయర్లు

ఫైనల్లో ఇండియా టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ ప్లేయర్లు

న్యూఢిల్లీ: డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్  టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. బ్రెజిల్‌‌‌‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌, మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌  జోడీలు ఫైనల్ చేరాయి.  ఒకే ఈవెంట్‌‌‌‌లో రెండు జోడీలు తుదిపోరుకు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. యంగ్ సెన్సేషన్‌‌‌‌ మానుష్ షా రెండు జట్లను ఫైనల్ చేర్చి డబుల్ గోల్డ్ మెడల్స్ ముంగిట నిలిచాడు.

 శనివారం జరిగిన మిక్స్‌‌‌‌డ్ డబుల్స్ సెమీస్‌‌‌‌లో టాప్ సీడ్ మానుష్ షా–-దియా చితాలే జోడీ  3-–0  (11–7, 11–2, 11–7)తో చిలీకి చెందిన నాలుగో సీడ్ నికోలస్ బుర్గోస్-– పౌలినా వెగా జంటను చిత్తు చేసింది. తుది పోరులో జపాన్‌‌‌‌కు చెందిన  క్వాలిఫయర్స్ సతోషి ఐడా-హోనోకా– హషిమోటోతో పోటీ పడనుంది. మెన్స్ డబుల్స్ సెమీస్‌‌‌‌లో మానవ్ థక్కర్–-మానుష్  3–2(5–-11, 11–-9, 11–-6, 8–-11, 11–-5)తో  హువాంగ్ యాన్-చెంగ్-క్యు– గువాన్-హోంగ్‌‌‌‌ (చైనీస్ తైపీ)పై ఉత్కంఠ  విజయం సాధించింది. గోల్డ్ మెడల్ పోరులో రెండో సీడ్  బెనెడిక్ట్– కియు (జర్మనీ)తో అమీతుమీ తేల్చుకోనుంది.