కొత్త చట్టాలు అప్రజాస్వామికం : న్యాయవాదులు

కొత్త చట్టాలు అప్రజాస్వామికం : న్యాయవాదులు

బషీర్ బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలు అప్రజాస్వామికం అని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో  నేషనల్ సమత లాయర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో  న్యాయవాది పుట్టా పద్మారావు అధ్యక్షత ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్​మాట్లాడుతూ.. పాలకులు చేసే చట్టాలు ప్రజలను కాపాడే విధంగా ఉండాలే కానీ, నిర్బంధించే విధంగా ఉండకూడదన్నారు. కొత్త చట్టాల్లోజ్యుడీషియల్ అధికారాలను తగ్గించి , పోలీసులకు పెంచారని విమర్శించారు.  వెంటనే కొత్త చట్టాలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.