ఆలయానికి రూ. 2 కోట్ల విలువైన ఆస్తుల విరాళం

ఆలయానికి రూ. 2 కోట్ల విలువైన ఆస్తుల విరాళం

గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట లక్ష్మీనర్సింహస్మామి ఆలయానికి ఆదివారం పలువురు దాతలు భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన త్రిగుళ్ల చంద్రశేఖరశర్మ భార్య అరుణ, కొడుకులు  కృష్ణచంద్రశర్మ, రఘువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, నందకిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ కలిసి సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 360లోని హీరాబాయమ్మ తోటలో ఉన్న 28 గుంటలు భూమిని ఆలయానికి విరాళం ఇచ్చారు. భూమికి సంబంధించిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదివారం ఈవో అన్నపూర్ణకు అందజేశారు.

అలాగే త్రిగుళ్ల పద్మనాభశర్మ పేరిట ఆయన కొడుకులు గోపాలకృష్ణ శర్మ, విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మకు సంబంధించిన 54 చదరపు గజాల్లోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం విరాళంగా ఇస్తూ దానికి సంబంధించిన పత్రాలను ఈవోకు అందజేశారు. విరాళంగా వచ్చిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు జగన్నాథాచార్యులు, వేద పండితులు నాగబాల కామేశ్వరశర్మ, అర్చకులు హరిప్రసాదశర్మ, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, గోపాలకృష్ణశర్మ, నాగరాజు శర్మ, రామకృష్ణ శర్మ పాల్గొన్నారు..