శ్రీరాముడికోసం పెద్దఎత్తున నేపాల్ ప్రజల కానుకలు

శ్రీరాముడికోసం పెద్దఎత్తున నేపాల్ ప్రజల కానుకలు

నేపాల్ లోని జనక్ పుర్ ధామ్ నుండి పెద్దఎత్తున అయోధ్యకు చేరుకుంటున్నారు ప్రజలు. తమ దేశ అల్లుడైన శ్రీరాముడి కోసం అనేక బహుమతులు తీసుకొచ్చారు. జనక్ పూర్ వాసులకు అయోధ్య వాసులు ఘన స్వాగతం పలికారు. నేపాల్ నుండి ప్రారంభమైన యాత్ర నిన్న ఉత్తరప్రదేశ్  అయోధ్యలోని కరసేవకపురం చేరుకుంది. సుమారు 36 వాహనాల్లో 500 మందికి పైగా భక్తులు తమతో పాటు పండ్లు, మిఠాయిలు, బంగారం, వెండి సహా మూడు వేలకు పైగా కానుకలను అయోధ్యకు తీసుకొచ్చారు.

అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్న ..రాముడి విగ్రహం వివరాలను వెల్లడించారు ట్రస్ట్ నిర్వాహకులు. నల్లని గ్రానైట్ రాయితో చేసిన రాముడి విగ్రహం ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించి అయోధ్య టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకటన చేశారు. నిలబడి ఉన్న రాముడు 51 ఇంచుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు.  కర్నాటక శిల్పులు అరుణ్ యోగిరాజ్, గణేష్ భట్ రూపొందిచిన విగ్రహాల్లో ఒక దాన్ని త్వరలో ఫైనల్ చేస్తామని చెప్పారు. జనవరి 22 న అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.