చిన్న ఇల్లు.. ఎక్కువ ఫెసిలిటీస్

చిన్న ఇల్లు.. ఎక్కువ ఫెసిలిటీస్

తక్కువ స్పేస్‌‌‌‌లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలనే ఐడియా నుంచి ఇప్పటికే చాలా మోడల్స్‌‌‌‌ పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని ఇండ్లే ఇవి. ఇవి ఒక్కోటి ఒక్కో దేశంలో ఉన్నాయి. అంతేకాదు వీటికి ఉన్న ప్రత్యేకతల వల్ల స్పెషల్‌‌‌‌ ఎట్రాక్షన్‌‌‌‌గా నిలిచాయి. చూడ్డానికి చిన్నగా ఉన్నా... ఫెసిలిటీస్‌‌‌‌ మాత్రం చాలా ఉంటాయి. డిఫరెంట్‌‌‌‌ ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటే వీటిని ట్రై చేయొచ్చు!

ఇల్లు కాని ఇల్లు 

బలుచోన్ అనే కంపెనీ ఈ ఇంటిని తయారు చేసింది. 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఇంత చిన్న ఇంట్లో స్టైలిష్‌‌‌‌ లివింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌, మాస్టర్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్, సెకండరీ లాఫ్ట్‌‌‌‌ని ఏర్పాటు చేశారు దీనికి హిప్పోలెన్ అని పేరు పెట్టారు. సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఫిక్స్‌‌‌‌ చేశారు.

 ఇంటీరియర్ డిజైనింగ్ చాలా ఢిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. 

బయటి నుంచి చూస్తే మామూలు ఇల్లులా కనిపించేలా డిజైన్‌‌‌‌ చేశారు.  ఒక సోఫా బెడ్, ఒక కాఫీ టేబుల్, వేడిగా ఉంచేందుకు చిన్న ఫైర్​ ప్లేస్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో  కిచెన్, లివింగ్ రూమ్‌‌‌‌కి, సింక్, ఫ్రిజ్‌‌‌‌ ఉన్న L- ఆకారపు యూనిట్‌‌‌‌ ఉంది. కంపోస్టింగ్ టాయిలెట్, షవర్ కూడా ఉన్నాయి. ఇది పశ్చిమ ఫ్రాన్స్‌‌‌‌లో ఉంది. 

రాకెట్ కాదు 

ఇప్పటివరకు కాంక్రీట్, పైపింగ్‌‌‌‌, వుడ్ ఇండ్లను చూసి ఉంటారు. వాటితో పోలిస్తే ఇది  చాలా డిఫరెంట్​గా ఉంటుంది. ఉల్టా పడ్డ రాకెట్​లో ఉన్న దీనిపేరు సైలో మైక్రో-హౌస్‌‌‌‌. దీన్ని నెదర్లాండ్స్‌‌‌‌లోని ఐండ్‌‌‌‌హోవెన్ డిజైన్ అకాడమీ గ్రాడ్యుయేట్ స్టెల్లా వాన్ బీర్స్ తయారుచేసింది. ఇందులో రెండు అంతస్తులు ఉన్నాయి. చిన్న లివింగ్ ఏరియా, బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఉంది. దీన్ని ఇదివరకు ఒక రైతు ధాన్యాన్ని స్టోర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి వాడేవాడు. అతని దగ్గర్నించి వాన్ బీర్స్ తీసుకుని ఇలా మార్చింది. దీని ఎత్తు 7 మీటర్లు. దీనికి రెండు డోర్లు పెట్టి పెయింట్‌‌‌‌ వేశారు. ఫస్ట్​ఫ్లోర్​లోని లివింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో ఒక నిచ్చెన ఉంది. దాని పైకి ఎక్కితే బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌ వస్తుంది. డచ్ డిజైన్ వీక్ –2021లో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. ఈ డిజైన్‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. 

లాక్కుపోవచ్చు 

రాకీ మౌంటైన్స్‌‌‌‌పై బౌల్డర్ 2.5 పేరుతో ఈ టైనీ హౌస్‌‌‌‌లు తయారుచేశారు. ఇవి 5.4 మీటర్లు మాత్రమే ఉంటాయి. దీన్ని ఇంటిలా వాడలేం. కానీ.. గెస్ట్‌‌‌‌ హౌస్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌ స్పేస్‌‌‌‌గా వాడుకోవచ్చు. వుడ్‌‌‌‌, మెటల్ సైడింగ్‌‌‌‌తో దీన్ని తయారుచేశారు. ఇది డబుల్-యాక్సిల్ ట్రైలర్‌‌‌‌పై ఆధారపడి ఉంటుంది. ట్రక్‌‌‌‌కు కట్టి ఎక్కడికైనా లాక్కొని వెళ్లొచ్చు. బౌల్డర్ 2. 5లో బీటిల్ కిల్ ఫైన్ సీలింగ్, సాలిడ్ ఓక్ ఫ్లోరింగ్‌‌‌‌ ఉన్నాయి. లోపల ఒక డైనింగ్ టేబుల్/ఆఫీస్ డెస్క్‌‌‌‌ ఉంది. రెండు బర్నర్లు ఉన్న చిన్న స్టవ్ ఉంటుంది. వీటితో పాటు సింక్‌‌‌‌, ఫ్రిజ్‌‌‌‌ కూడా ఉన్నాయి. లివింగ్ రూమ్‌‌‌‌లో చిన్న డైనింగ్ ఏరియా ఉంది. కానీ.. ఒక్క సోఫా కూడా లేదు. బాత్రూమ్‌‌‌‌లో షవర్, కంపోస్టింగ్ టాయిలెట్‌‌‌‌ ఉన్నాయి. 

ఆరు బెర్త్‌‌‌‌ల ఇల్లు 

ఈజీగా తయారుచేసుకుని, అంతకంటే ఈజీగా విప్పదీసుకునేట్టు ఈ ఇంటిని తయారు చేశారు.  దీని ఇంటీరియర్ చాలా పొందికగా ఉంటుంది. ఈ చిన్న ఇంట్లో ఆరుగురు ఉండొచ్చు. మరో ఇద్దరు సోఫాపై పడుకోవచ్చు. ఈ ఇంటి పొడవు 8 మీటర్లు. సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ద్వారా ఇంటికి కావాల్సిన కరెంట్‌‌‌‌ అందుతుంది. డబుల్‌‌‌‌ గ్లాస్ డోర్స్‌‌‌‌ ఫిక్స్ చేశారు. మిగతా ఇల్లంతా ప్లైవుడ్‌‌‌‌తో తయారుచేశారు. కిచెన్‌‌‌‌లో ఓవెన్, రెండు బర్నర్ల స్టవ్, వాషర్/డ్రైయర్, సింక్, మరి కొన్ని క్యాబినెట్లు ఉన్నాయి. లివింగ్ రూమ్‌‌‌‌కి ఎదురుగా బాత్‌‌‌‌రూమ్ ఉంది. రెండు బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లు కూడా ఉన్నాయి. మాస్టర్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌కి కిచెన్‌‌‌‌ పక్క నుంచి యాక్సెస్ ఉంటుంది. రెండో బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌కి లివింగ్ రూమ్ నుంచి దారి ఉంటుంది. న్యూజిలాండ్‌‌‌‌లోని బిల్డ్ టైనీ ఈ ఇంటిని తయారుచేసింది. 

ఆరుబయట మంచం 

ఇటలీలో కొండల మధ్య ఉన్న చిన్న టౌన్‌‌‌‌ గారెసియో. అక్కడ ఇటాలియన్ ఆర్కిటెక్చర్ సంస్థ అఫ్ఫిషీనా–82 క్రియేట్ చేసిన చిన్న ఇల్లు ఇది. దీని పేరు ‘గ్లామ్ బాక్స్‌‌‌‌’. దీన్ని ఇటాలియన్‌‌‌‌ సంప్రదాయ పద్ధతుల్లో కట్టారు. ఈ చిన్న ఇంటికి చిన్న వరండా కూడా ఉంది. వరండాలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ, నక్షత్రాలను చూస్తూ హాయిగా నిద్రపోవచ్చు. ఈ గ్లామ్‌‌‌‌ బాక్స్‌‌‌‌ 15- చదరపు మీటర్లు ఉంటుంది. దీన్ని ఆ ప్రాంతంలో ఎక్కువగా దొరికే చెస్ట్‌‌‌‌నట్ వుడ్‌‌‌‌తో తయారు చేశారు. భూమి నుంచి కాస్త ఎత్తులో ఒక పెద్ద చెక్క డెక్‌‌‌‌ ఏర్పాటు చేసి, దానిపై ఇల్లు తయారుచేశారు. గోడ సైజులోనే ఉండే స్లైడింగ్ డోర్స్‌‌‌‌ని పెట్టడం వల్ల డోర్స్‌‌‌‌ చాలా తక్కువ స్పేస్‌‌‌‌ తీసుకున్నాయి. ఈ ఇంట్లో ఇంటీరియర్​ డిజైనింగ్ సింపుల్​గా ఉంటుంది. ఇందులో నలుగురు కంఫర్ట్‌‌‌‌గా ఉండొచ్చు. దీని గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో కామన్‌‌‌‌ లివింగ్ రూమ్‌‌‌‌, బెడ్‌‌‌‌రూమ్, ఒక చిన్న స్టడీ రూమ్‌‌‌‌, బాత్రూమ్‌‌‌‌, ఓపెన్ స్పేస్ ఉన్నాయి. వీటితో పాటు చక్రాలతో ఉన్న ఒక మాస్టర్ బెడ్ క్యాబిన్ కూడా ఉంది. దాన్ని ఆరుబయట వరండాలో వేసుకోవడానికి డిజైన్‌‌‌‌ చేశారు. హాల్లోని బ్లాక్ మెటల్ నిచ్చెన ద్వారా ఫస్ట్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లొచ్చు. అక్కడ రెండు స్లీపింగ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌ ఉంటాయి. ఒక్కో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో సింగిల్ బెడ్‌‌‌‌ ఉంటుంది. 

అంతా చెక్కతోనే
పోర్చుగీస్ వుడ్ వర్కింగ్ స్టూడియో మాడీగుయించో ఈ చిన్న ఇంటిని తయారుచేసింది. దీనికి పూర్తిగా కలప మాత్రమే వాడారు. ఈ ఇంటిని ఎక్కడికంటే అక్కడికి లాక్కొని తీసుకెళ్లొచ్చు. రెండు పెద్ద డోర్లు ఉంటాయి. డబుల్-యాక్సిల్ ట్రైలర్‌‌‌‌ని బేస్‌‌‌‌ చేసుకుని దీన్ని కట్టారు. పొడవు 7 మీటర్లు. దీనిపైన ఉండే సోలార్ ప్యానెల్ ద్వారా ఇంటికి కావాల్సిన పవర్‌‌‌‌‌‌‌‌ని స్టోర్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటుంది. రెయిన్‌‌‌‌ వాటర్ కలెక్షన్ సిస్టమ్ ఫిల్టర్లకు కనెక్ట్ చేసి ఉంటుంది. దాన్నుంచి షవర్, కిచెన్‌‌‌‌కు పైపుల ద్వారా నీళ్లు అందుతాయి. 

ఇందులో లివింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌ చాలా పెద్దది. లివింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో సోఫా బెడ్, ఫోల్డబుల్‌‌‌‌ డైనింగ్ టేబుల్ పెట్టారు. ఈ స్పేస్‌‌‌‌లో కిటికీలు ఉండవు. అందుకే ఆపరేటబుల్ డోర్లు పెట్టారు. లివింగ్ రూమ్ పక్కన కిచెన్‌‌‌‌ ఉంది. ఇందులో క్యాబినెట్, స్టోన్ సింక్, స్టవ్, ఫ్రిజ్ ఉన్నాయి. బాత్రూమ్ లివింగ్ రూమ్‌‌‌‌కి ఎటాచ్‌‌‌‌ చేసినట్టు ఉంటుంది. అందులో షవర్, కంపోస్టింగ్ టాయిలెట్ ఉన్నాయి. ఇందులో ఒక బెడ్‌‌‌‌రూమ్ పై అంతస్తులో ఉంటుంది. మెట్ల ద్వారా బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లోకి వెళ్లొచ్చు. ఇందులో డబుల్ బెడ్‌‌‌‌ ఉంది.