వేసవిలో చర్మాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వేసవిలో చర్మాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏ సీజన్​లో ఆ వాతావరణానికి తగ్గట్టు స్కిన్ గురించి జాగ్రత్తలు తీసుకుంటారు చాలామంది. ఇంట్లో తయారుచేసిందైనా, మార్కెట్లో కొన్న ప్రొడక్ట్​ అయినా స్కిన్ పాడవకుండా ఉండాలనుకుంటారు. వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ప్రొడక్ట్స్​ వాడాలంటే..

మామూలుగా వేసవిలో వాతావరణం వేడిగా ఉండటం వల్ల స్కిన్​ కేర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇక డ్రై స్కిన్ ఉన్నవాళ్లైతే తమ స్కిన్ పట్ల చాలా అసంతృప్తిగా ఫీలవుతారు సమ్మర్​లో. అలాంటి వాళ్లకోసమే ఈ ఐదు రకాల ఫేస్ మిస్ట్​ ప్రొడక్ట్స్​ మార్కెట్​లోకి వచ్చాయి. చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి.  

మొదటిది.. ఫారెస్ట్ ఎసెన్షియల్ ఫేషియల్ టోనిక్ మిస్ట్ ప్యూర్ రోజ్​ వాటర్. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు దీన్ని ముఖానికి అప్లై చేసుకుంటే.. ముఖానికి చల్లదనాన్నిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు మాయిశ్చరైజర్​లా పనిచేస్తుంది.

రెండోది.. ప్లమ్ గ్రీన్ టీ రీవైటలైజింగ్ ఫేస్ మిస్ట్. ప్లమ్, అలోవెరా, గ్రీన్ టీ కలిపి దీన్ని తయారుచేశారు. ఇది మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్​ ఇచ్చి, పోషణ అందించాలంటే దీన్ని వాడొచ్చు.

మూడోది.. ది బాడీ షాప్ రోజ్ డెవీ గ్లో ఫేస్ మిస్ట్. దీన్ని ఫేస్​కి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. మంచి వాసన ఉంటుంది. రాస్​బెర్రీ ఎసెన్స్, చెర్రీ వాటర్​లని కలిపి తయారుచేశారు. అందువల్ల ఇది వాడితే నేచురల్ గ్లో వస్తుంది. 

నాలుగోది.. పిల్​గ్రిమ్ ఆల్కహాల్ ఫ్రీ ఫేస్ మిస్ట్. ఇందులో ఆల్కహాల్ ఉండదు. ఇది చర్మం లోపలికి వెళ్లి పనిచేయడం వల్ల ముఖంలో అలసట పోయి, తాజాగా కనిపిస్తుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఇది ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. 

చివరిది.. టీఎన్​డబ్ల్యూ రోజ్ వాటర్. ఇది అందరికీ తెలిసిందే. ముఖంపై జిడ్డు, మచ్చలు పోవాలని రోజ్​ వాటర్​తో క్లీన్ చేస్తారు. అలాగే టీఎన్​డబ్ల్యూ రోజ్ వాటర్​ కూడా వాడొచ్చు. అలా చేస్తే స్కిన్​లో కొలాజెన్ లెవల్స్ మెయిన్​టెయిన్ అవుతాయి.  

అయితే... ఇవే వాడాలని లేదు. ఎందుకంటే మార్కెట్లో బోలెడు ప్రొడక్ట్స్​ దొరుకుతున్నాయి. కాబట్టి ఏ ప్రొడక్ట్ ఎలాంటి స్కిన్​కు  
పని చేస్తుందో కనుక్కుని, దానికి తగ్గ ప్రొడక్ట్​ ఎంచుకుని వాడడం బెటర్.