టీవీ బడికి ఫస్ట్ డే వేలాది మంది మిస్

టీవీ బడికి  ఫస్ట్ డే వేలాది మంది మిస్
  • ప్రభుత్వ, ఎయిడెడ్ స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాసులు షురూ
  • పలుచోట్ల పవర్ కట్స్ తో కష్టాలు
  • ఏజెన్సీ ప్రాంతాల్లోఆటపాటల్లోనే చిన్నారులు

నెట్వర్క్, వెలుగుకరోనా లాక్​డౌన్ నేపథ్యంలో సుమారు 163 రోజులపాటు స్కూల్​కు దూరంగా ఉన్న స్టూడెంట్లను మంగళవారం టీవీ బడి పలకరించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్​స్కూళ్ల పరిధిలో 3 నుంచి పది వరకు చదువుతున్న స్టూడెంట్లకు డిజిటల్ క్లాసులు మంగళవారం అఫీషియల్​గా ప్రారంభం కాగా, తొలిరోజు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు యాదగిరి, టీశాట్​చానళ్లలో డిజిటల్​క్లాసులు జరగగా, పేదల ఇండ్లలో టీవీలు, వాటికి డిష్​కనెక్షన్, స్మార్ట్​ఫోన్లు, వాటికి సిగ్నల్స్​ లేక వేలాదిమంది స్టూడెంట్స్​క్లాసులు మిస్​ అయ్యారు. పలుచోట్ల  ట్రాన్స్​కో డిపార్ట్​మెంట్​కు సమాచారం లేక పవర్​కట్స్​వల్ల క్లాసులు వినలేకపోయారు. టైంటేబుల్​ స్టూడెంట్స్​దాకా చేరకపోవడం వల్ల కూడా క్లాసులు మిస్సయ్యామని స్టూడెంట్స్​ చెప్పారు.

25 వేల బడులు.. 17 లక్షల స్టూడెంట్లు

రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రైవేట్​స్కూళ్లు జూన్, జులై నెలల నుంచే ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభించగా, సర్కారు, ఎయిడెడ్​బడుల్లో మాత్రం మంగళవారం అఫీషియల్​గా మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల వరకు ఉన్న సర్కారు బడుల్లో 17,18,710  మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. 1.20 లక్షల రెగ్యులర్​ టీచర్లు గత నెల 27నే డ్యూటీల్లో చేరి ఐదు రోజులపాటు డిజిటల్​ క్లాసులకు కసరత్తు చేశారు. 2 లక్షల మంది స్టూడెంట్ల ఇండ్లలో టీవీలు లేవని, 5 లక్షల టీవీలకు టీశాట్​ ప్రసారాలు లేవని, 12 లక్షల మంది స్టూడెంట్ల ఇండ్లలో సెల్​ఫోన్లు ఉన్నా అందులో సగం ఫోన్లకు ఇంటర్​నెట్​లేదని సర్వే ద్వారా టీచర్లు తేల్చారు. దీంతో ఇంటర్​నెట్​తో కూడిన స్మార్ట్​ఫోన్​, ల్యాప్​టాప్​ ఉన్నవారిని ఒక సెక్షన్​గా, టీవీల్లో దూరదర్శన్​, టీశాట్​ చూసే చాన్స్​ ఉన్నవారిని రెండో సెక్షన్​, పైరెండు లేనివారిని మూడో సెక్షన్​గా విభజించి అందుకనుగుణంగా క్లాసులకు ఏర్పాట్లు చేశారు.

తొలిరోజు అంతంతే రెస్పాన్స్​

మొదట స్టూడెంట్లతో వాట్సప్​ గ్రూపులు ఏర్పాటుచేసి, దాని ద్వారా మానిటరింగ్​ చేయాలని భావించారు. కానీ సర్కారు బళ్లలో చదువుతున్న కుటుంబాల్లో పదిశాతం మందికి కూడా స్మార్ట్​ఫోన్లు లేకపోవడంతో వాట్సప్​ గ్రూపుల ప్లాన్​ సక్సెస్​ కాలేదు. కరోనా నేపథ్యంలో స్టూడెంట్ల ఇండ్లకు వెళ్లి సమాచారం ఇచ్చేందుకు చాలామంది టీచర్లు ప్రయత్నించలేదు. కానీ ప్రతి గ్రామంలో మంగళవారం నుంచి డిజిటల్ ​క్లాసులు ప్రారంభమవుతాయని డప్పు చాటింపు వేయించారు. కానీ చాలామంది స్టూడెంట్లకు టైంటేబుల్​ చేరలేదు. దీంతో ఏ క్లాసు ఎప్పుడో తెలియక  స్టూడెంట్లు కన్ఫ్యూజ్​ అయ్యారు. తొలిరోజు థర్డ్​టు ఫిఫ్త్ వరకు గంటన్నర, 6 నుంచి 8 వరకు రెండుగంటలు, నైన్త్, టెన్త్​క్లాసులకు 3 గంటల చొప్పున  టైం కేటాయించారు. మార్నింగ్​10 నుంచి ఈవినింగ్​4.30 వరకు ఫిఫ్త్​ తప్ప అన్ని తరగతుల వారికి డిజిటల్​ క్లాసులు నడిచాయి. ఉదయం 10 గంటలకు థర్డ్​ క్లాస్​స్టార్ట్​ కాగానే ఫోర్త్​ క్లాస్ స్టూడెంట్స్​టీవీల ముందు నుంచి గాయబ్​అయ్యారు. తర్వాత అరగంటకే ఫోర్త్​ క్లాస్ స్టార్ట్​అయినా మళ్లీ చాలామంది టీవీల ముందుకు రాలేదు. ఇక 8, 9,10 తరగతులవారికి అటు యాదగిరిలో, ఇటు టీశాట్​లో క్లాసులు జరగడంతో ఇబ్బంది పడ్డారు. ఇక చాలా ఇండ్లలో పేరెంట్స్​ పొలం పనులకు, కూలిపనులకు వెళ్లిపోవడంతో స్టూడెంట్లను టీవీల ముందు కూర్చోబెట్టేవారు లేకుండాపోయారు. ఇక టీవీలే లేని 2 లక్షల మంది స్టూడెంట్లను స్కూళ్లలో, పంచాయతీల్లో, పక్క ఇండ్లలోని టీవీల వద్ద కూర్చోబెట్టాలన్న ప్రయత్నం పూర్తిస్థాయిలో సక్సెస్​ కాలేదు. చాలా స్కూళ్లు, పంచాయతీల్లో టీవీలు ఏనాడో అటకెక్కాయి. ఇక కరోనా నేపథ్యంలో చాలామంది పేరెంట్స్​వారి ఇండ్లలోకి వేరే పిల్లలను రానివ్వలేదు. అనేక ఏరియాల్లో విద్యాశాఖ నుంచి కరెంటోళ్లకు సమాచారం లేకపోవడంతో రిపేర్లు, చెట్ల కొమ్మల కొట్టివేతల కోసం వపర్​ కట్​చేశారు. మొత్తంగా తొలిరోజు వేలాది  స్టూడెంట్స్​, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో క్లాసులు మిస్సయ్యారు.

  • కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్​నగర్, బద్దిపల్లి విద్యుత్ సబ్​స్టేషన్​కు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ఎలగందుల, ఆసిఫ్​నగర్, బద్దిపల్లి, కమాన్​పూర్, చింతకుంట, బావుపేట, నాగులమల్యాల గ్రామాల్లో  స్టూడెంట్లంతా టీవీ క్లాసులు చూడలేకపోయారు.
  • మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో లోకల్ కేబుల్ ప్రసారాల్లో అంతరాయం వల్ల, కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (ఆర్) లో కరెంట్​ లేక టెన్త్​ స్టూడెంట్లు క్లాసులు మిస్సయ్యారు.
  • ఆసిఫాబాద్ జిల్లా  సిర్పూర్( యు) మండలం నెట్నూరులో 74 మంది స్టూడెంట్స్ ఉన్నారు. గ్రామంలో 9 ఇండ్లలోనే టీవీలున్నాయి.  స్కూల్ లో టీవీ ఏర్పాటు చేసి డిజిటల్ ​క్లాస్ స్టార్ట్ చేయగా,  పది నిమిషాలకే పవర్ ట్రిప్ అయింది. దీంతో
    స్టూడెంట్స్​ ఇండ్లకు వెళ్లిపోయారు.
  • ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొలాంగోందిలో అటవీ భూములు ఆక్రమించారంటూ ఫారెస్టు ఆఫీసర్లు ఇండ్లు కూల్చేసిన 13 కుటుంబాలవారికి సాలేగూడ దగ్గర గుడిసెలు వేసుకున్నా కరెంట్​ సౌకర్యం లేదు. ఒక్కరి  ఇంట్లో కూడా టీవీ, ఆండ్రాయిడ్ ఫోన్ లేవు. దీంతో 18 మంది స్టూడెంట్లు  క్లాసులకు దూరమయ్యారు.
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని బీరప్ప నగర్, అంగడి ప్రాంతాల్లో  సుమారు 20కు పైగా సంచారజాతి కుటుంబాలు చెట్ల కింద గుడిసెలు వేసుకొని ఉంటున్నాయి. టీవీలు, స్మార్ట్​ ఫోన్లు లేక పది మంది పాఠాలు వినలేకపోయారు.
  • సిద్దిపేట జిల్లాలో  చాలాచోట్ల టీవీలో లెసన్స్​ ప్రసారమైన టైమ్​లో కరెంట్​ లేదు. టీవీలు, కేబుల్​ కనెక్షన్​ లేని పిల్లలు వారికి ఇచ్చిన పుస్తకాలు చదువుకుంటూ కనిపించారు.
  • యాదాద్రి జిల్లా ఆలేరులో 7, 9వ తరగతి క్లాసులు మొదలయ్యే టైమ్​కు  కరెంట్ పోయింది. క్లాస్​ అయిపోయేంతవరకు కరెంట్​ రాలేదు.

85 శాతం స్టూడెంట్స్ పాఠాలు విన్నారు: విద్యాశాఖ

రాష్ట్రంలో తొలిరోజు 85.42 శాతం స్టూడెంట్స్​ వివిధ రూపాల్లో డిజిటల్ పాఠాలు విన్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. మొత్తం 16,43,309(ఐదో తరగతి మినహా) స్టూడెంట్లకు 14,03,826 మంది పాఠాలు విన్నట్టు తెలిపారు. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా 10,72,851 మంది, గ్రామపంచాయతీ, లైబ్రరీ, ఇతర మార్గాల ద్వారా 78,696 మంది, స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్​ ద్వారా 1,91,768 మంది, ఇతర మార్గాల ద్వారా 60,515 మంది పాఠాలు విన్నారన్నారు. మంగళవారం ఒక్కరోజే 1,42,979 మందికి వర్క్​షీట్లు అందించినట్టు ప్రటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా చేపట్టిన డిజిటల్ తరగతులకు విశేష స్పందన లభించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారని చెప్పారు.

రెండు క్లాసులు మిస్సయ్యా

టీవీలో క్లాస్ విందామని పొద్దుటి నుంచే ప్రిపేర్ అయ్యా.  కానీ కరెంట్ లేక పోవడంతో తెలుగు, ఫిజికల్ సైన్స్ క్లాసులు మిస్సయ్యా. రేపటి నుంచైనా క్లాస్ టైమ్ కు కరెంట్ ఉంటదో.. లేదోనని టెన్షన్​ అయితాంది.

‑ ఐశ్వర్య, టెన్త్​ స్టూడెంట్, వెంటాపూర్​

అప్పు చేసి టీవీ కొన్న

నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. పదేళ్ల కింద నా భర్త పిడుగు పడి చనిపోయిండు. కూలి నాలీ చేస్తూ పిల్లలను చదివిస్తున్న. టీవీ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఆన్​లైన్​ క్లాసులు చెప్తున్నరని అప్పు చేసి టీవీ, డీటీహెచ్​ కొన్న. వాళ్ల చదువుకు మించి నాకు ఇంకేం కావాలె.

‑ దెబ్బటి జ్యోతి, దహెగాం