'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ రివ్యూ: మహేష్ బాబు కొడుకు గౌతమ్ షాకింగ్ రియాక్షన్.. 'ప్రతి సెకనుకు గూస్‌బంప్స్!'

'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ రివ్యూ: మహేష్ బాబు కొడుకు గౌతమ్ షాకింగ్ రియాక్షన్.. 'ప్రతి సెకనుకు గూస్‌బంప్స్!'

ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసిన దర్శకధీరుడు ఎస్. ఎస్ . రాజమౌళి.  ఆయన సృష్టించిన అద్భుత చిత్రం 'బాహుబలి' 2015లో రిజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఈ తర్వాత వచ్చిన బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి చెప్పనక్కర్లేదు.  బాహుబలి సిరీస్ ను ఇప్పుడు కొత్త రూపంలో రెండు బాగాలను కలిపి , ఎడిట్ చేసి.. 'బాహుబలి : ది ఎపిక్ 'పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.  అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

గౌతమ్ ఘట్టమనేని ఫస్ట్ రివ్యూ

 అయితే  'బాహుబలి : ది ఎపిక్ ' ఒక్కరోజు ముందే ఓవర్సీస్ లో ఈ మూవీ రిలీజైంది.  దాదాపు 3 గంటల 45 నిమిషాల నిడివి గల ఈ మూవీని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు . లేటెస్ట్ గా ఈ సరికొత్త వెర్షన్‌ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన అనుభూతిని పంచుకున్నారు.

'నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే' ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఇప్పుడు రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు గౌతమ్. ఓవరాల్‌గా ఎడిటింగ్‌లో చేసిన మార్పులు అద్భుతంగా ఉన్నాయి. మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు దక్కడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూస్తూ పెరిగిన నాకు, ఈ రెండు భాగాలను ఒకేసారి చూడటం గ్రేటెస్ట్ ఫీలింగ్. నాకు ప్రతి సెకనుకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇది నా జీవితంలోనే గొప్ప సినిమా అనుభవాల్లో ఒకటి అని గౌతమ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  'బాహుబలి : ది ఎపిక్ ' X రివ్యూ..

  'బాహుబలి : ది ఎపిక్ ' రీ-ఎడిటెడ్ వెర్షన్‌పై సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన సానుకూల స్పందన వస్తోంది. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ హాఫ్ ఊపిరి సలపనివ్వడం లేదు. ఇంటర్వెల్ వరకు సంఘటనలన్నీ చాలా వేగంగా కదులుతాయి. విజువల్స్, సౌండ్ క్వాలిటీ అస్సలు పాతబడలేదు, నేటి సినిమాలకు ధీటుగా ఉన్నాయి అని పోస్ట్ చేశారు.

 

మరొకరు.. ఈ సినిమా IMAX ఫార్మాట్‌కు పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజ్ చేయబడింది. ఇమేజ్, సౌండ్ క్వాలిటీలో ఎక్కడా లోపం లేదు. ఇది డబ్బు కోసం చేసిన చౌక రీ-రిలీజ్ లా అనిపించడం లేదు. రాజమౌళికి ధన్యవాదాలు.. ఈ అద్భుత ప్రపంచాన్ని మళ్లీ మా కోసం, ప్రపంచం కోసం తీసుకొచ్చినందుకు అని ట్వీట్ చేశారు.

►ALSO READ | Nani: 'ది ప్యారడైజ్' కోసం హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్.. టాలీవుడ్‌-హాలీవుడ్ కాంబోపై భారీ హైప్!

 

 ఈ సింగిల్-ఫిల్మ్ వెర్షన్‌లో కొన్ని రొమాంటిక్ పాటలు, కొన్ని సుదీర్ఘ సన్నివేశాలను తొలగించినట్టు తెలుస్తోంది.  దీనిలో 'కన్నా నిదురించరా', 'ఇరుక్కుపో' వంటివి పాటలను కట్ చేశారు. కథనాన్ని మరింత తీర్చిదిద్దటానికి ఈ మార్పులు చేశారు దర్శకుడు రాజమౌళి. అర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.