రంజీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సహచర ఆటగాడు పృథ్వీ షాకు షేర్ చేశాడు. చండీఘర్ తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో మహారాష్ట్ర 148 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గైక్వాడ్ జట్టు కష్టాల్లో ఉంటే ఒంటరి పోరాటం చేశాడు. 116 పరుగులు చేసి మహారాష్ట్రను ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అవార్డు తీసుకున్న తర్వాత గైక్వాడ్ తన గొప్ప తనాన్ని చాటుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను పృథ్వీ షా తో కలిసి పంచుకున్నాడు. గైక్వాడ్ చేసిన ఈ పనికి నెటిజన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో పృథ్వీ షా తొలి ఇన్నింగ్స్ లో దుమ్ములేపాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని సంచలనం సృష్టించాడు. కొంతకాలంగా ఫామ్ లేమి.. ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఈ ముంబై బ్యాటర్ ఎట్టకేలకు తనలోని పాత ఫామ్ ను బయటపెట్టాడు.
ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా షా 156 బంతుల్లో 222 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 141 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న షా రంజీ ట్రోఫీ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయడం విశేషం. తొలి స్థానంలో రవిశాస్త్రి ఉన్నాడు. 1985 లో శాస్త్రి బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. జట్టు చేసిన 359 పరుగులలో షా ఒక్కడే 222 పరుగులు చేయడం విశేషం.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగులకు ఆలౌట్ అయింది. గైక్వాడ్ 116 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత చండీఘర్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో మహారాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో మహారాష్ట్ర 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 464 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చండీఘర్ తమ రెండో ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌటైంది.
RUTURAJ WINNING THE HEARTS...!!! 😍
— Johns. (@CricCrazyJohns) October 28, 2025
- Rutu shared his Player of the match award with Prithvi Shaw, A lovely moment. pic.twitter.com/pPr35OARZw
