
హైదరాబాద్ : సిటీలో ఓ వైపు మైట్రో రైళ్లు, ఏసీ బస్సులు నడుస్తున్నట్లే మరోవైపు రిక్షా బండ్లు కూడా కనిపిస్తున్నాయి. బేగంజజార్, ఉస్మాన్ గంజ్, మహారాజ్ గంజ్, గౌలిగూడ, అప్జల్‌గంజ్, లాడ్ బజార్, కోఠి, ప్రాంతాల్లో ఎంతో మంది కార్మికులు ఇప్పటికీ రిక్షా నడుపుతూ బతుకుతున్నారు. ఒకప్పుడు టూరిస్టులను, జనాలను తీసుకెళ్లిన రిక్షాలో నేడు గూడ్స్‌ను తరలిస్తున్నారు. రిక్షా నడపనిదే పూట గడవదని కార్మికులు అంటున్నారు. రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకూ కూలీ వస్తుందని, రాత్రి వరకూ కష్టపడతామని వాళ్లు చెప్తున్నారు. సిటీలో సుమారు 10వేల రిక్షాలున్నాయని, సుమారు 10 నుంచి 50 ఏండ్ల అనుభవం ఉన్నవాళ్లు ఇంకా రిక్షా నడిపిస్తూనే ఉన్నారని కార్మికులు తెలిపారు. బేగంబజార్రూట్లో సామగ్రి తీసుకెళ్తూ రిక్షావాలాలు ఇలా కనిపించారు. - వెలుగు, హైదరాబాద్