- సుక్మా జిల్లా గోమగుండ అడవుల్లో గుర్తింపు
- భారీ ఎత్తున ఆయుధాలు, సామగ్రి స్వాధీనం
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గోమగుండ అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టుల ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని మంగళవారం డీఆర్జీ బలగాలు ధ్వంసం చేశాయి. సుక్మా ఎస్పీ కిరణ్‌చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం... డీఆర్జీ బలగాలు మంగళవారం గోమగుండ అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా.. ఆయుధాల తయారీ కోసం మావోయిస్టులు నిర్మించుకున్న ఫ్యాక్టరీని గుర్తించారు.
ఫ్యాక్టరీని ధ్వంసం చేసి, 17 దేశీ రైఫిల్స్, బీజీఎల్ లాంచర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు తయారు చేసే మెషీన్లు, గన్ బ్యారల్స్, డ్రిల్ మెషీన్,ఈన్, గ్రైండర్, వెల్డింగ్ షీల్డ్, స్టీలు పైప్‌లు స్వాధీనం చేసుకొని సుక్మా ఎస్పీ ఆఫీస్‌కు తరలించారు. మావోయిస్టుల నెట్‌వర్క్ మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
