- 50 మంది అనుచరులతో మహ్లా క్యాంప్‌కు..
- రాంధర్‌పై రూ. 50 లక్షల రివార్డ్
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధర్ అలియాస్ సోమా అలియాస్ మజ్జి దేబూ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని పఖాంజూర్ జిల్లాలో గురువారం లొంగిపోయారు. ఆయన 50 మంది అనుచరులతో కలిసి పఖాంజూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్లా క్యాంప్‌నకు చేరుకున్నారు. 51 ఏండ్ల రాంధర్‌పై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. బీజాపూర్ జిల్లా బేద్రే పోలీస్‌స్టేషన్ పరిధిలోని మజ్జి మాంద్రి గ్రామానికి చెందిన రాంధర్ దండకారణ్యం మిలటరీకి నాయకత్వం వహిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 39 ఆయుధాలను బలగాలకు అప్పగించారు. వీరంతా ప్రస్తుతం మహ్లా క్యాంప్‌లో ఉన్నారు.
