కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఆయుధాలు విడిచి లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయేందుకు డేట్ ఫిక్స్ చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ జోన్ ప్రతినిధి పేరుతో లేఖ విడుదల చేశారు. ఒక్కొక్కరు కాదు..అందరం ఒకేసారి లొంగిపోతామని చెప్పారు.
కాల్పుల విరమణకు తేదీని ప్రకటించారు మావోయిస్టులు..జనవరి 1న ఆయుధాలు వదిలి లొంగిపోతామని లేఖ రాశారు. ఒక్కొక్కరుగా కాదు.. అందరం కలిసి లొంగిపోతామని తెలిపారు. పరస్సర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ నంబర్ ను షేర్ చేశారు. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంలో వెళ్తామని మావోయిస్టులు ప్రకటించారు.
ఆయుధాలు వదులు కోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వివరణ ఇచ్చారు. ఇది సంఘర్షణకు సమయం కాదన్న మావోయిస్టులు.. 2026 జనవరి 1 నుంచి కాల్పులు విరమిస్తామని ప్రకటించారు.
