మరో టీచర్ను హత్య చేసిన మావోయిస్టులు.. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన

మరో టీచర్ను హత్య చేసిన మావోయిస్టులు.. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు మరో టీచర్​ను చంపిన ఘటన చత్తీస్​గఢ్​లో జరిగింది.  బీజాపూర్​జిల్లా గంగులూరు పోలీస్​స్టేషన్​పరిధి తోడ్కా గ్రామానికి చెందిన టీచర్​కల్లూ తాతి(27) డ్యూటీ నుంచి తిరిగొస్తుండగా శుక్రవారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్​చేశారు. పోలీసులకు ఇన్​ఫార్మర్​గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో చిత్రహింసలకు గురి చేసి కత్తులతో పొడిచి చంపారు. రెండు రోజుల కిందే సుక్మా జిల్లా సిల్గేర్ ​గ్రామంలో టీచర్ లక్ష్మణ్​బార్సేను హత్య చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మూతపడిన స్కూళ్లను తిరిగి తెరిచాక టీచర్లను టార్గెట్​గా చేసుకున్నారు. బీజాపూర్​ జిల్లాలో 5 మంది, సుక్మా జిల్లాలో నలుగురు టీచర్లను మావోయిస్టులు హత్య  చేశారు. ఆయా ఘటనలతో గిరిజన గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి.