ధాన్యం లారీని దహనం చేసిన మావోయిస్టులు

ధాన్యం లారీని  దహనం చేసిన మావోయిస్టులు

భద్రాచలం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల వేళ భద్రాచలం ఏజెన్సీలో మంగళవారం రాత్రి మావోయిస్టులు రెచ్చిపోయారు. ధాన్యంతో వస్తున్న లారీని తగులబెట్టి పోలీసులకు సవాల్​ విసిరారు. చర్ల మండలం వద్దిపేటలో ఏపీ రిజిస్ట్రేషన్  నంబరు గల లారీలో ధాన్యం లోడ్  చేశారు.

ఈ లారీ వద్దిపేట నుంచి చర్ల వస్తుండగా మావోయిస్టులు దారి కాచి ధాన్యాన్ని కిందకు దించి నిప్పు అంటించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే  పిలుపునిచ్చారు.