మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపిన్రు

మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపిన్రు
  •      మావోయిస్ట్‌‌ నార్త్‌‌ సబ్‌‌ జోనల్‌‌ ప్రతినిధి మంగ్లిక్‌‌

భద్రాచలం, వెలుగు : కూంబింగ్‌‌ టైంలో పట్టుబడిన 17 మంది మావోయిస్టులను పోలీసులు ఎన్‌‌కౌంటర్‌‌ పేరుతో కాల్చి చంపారని మావోయిస్ట్‌‌ పార్టీ నార్త్‌‌ జోనల్‌‌ ప్రతినిధి మంగ్లిక్​ శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. చత్తీస్‌‌గఢ్‌‌లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది మావోయిస్టులు పోరాడి చనిపోయారని, తీవ్రంగా గాయపడిన 8 మందిని హింసించి చంపేశారన్నారు. 

ఇన్‌‌ఫార్మర్‌‌ ఇచ్చిన సమాచారంతో రెస్ట్‌‌ తీసుకుంటున్న మావోయిస్టులు చుట్టుముట్టు కాల్పులు జరిపారన్నారు. దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను దోచి పెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులపై దాడులు చేయిస్తోందన్నారు. ఎన్‌‌కౌంటర్‌‌తో పాటు, పట్టుకొని కాల్చి చంపిన ఘటనలకు బీజేపీ లీడర్లే బాధ్యులన్నారు. బీజేపీ నేతలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్‌‌కౌంటర్‌‌ను నిరసిస్తూ ఈ నెల 25న నారాయణపూర్, కంకేర్, మోహ్లా, మన్‌‌పూర్‌‌ జిల్లాల్లో బంద్‌‌ పాటించాలని పిలుపునిచ్చారు.