వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( డిసెంబర్ 7 నుంచి 13 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం..
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారు శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. పెండింగ్ పనుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారు అంచనాలు , ఊహలు నిజం చేసుకుంటారు.
మిధునరాశి: ఈ వారం ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వీరు చేపట్టిన వ్యవహారాలలో మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరగడంతో రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కర్కాటకరాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. ఈ రాశి వారు ఈ వారంలో తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి : ఈ రాశి వారు ఈ వారం రిస్క్ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యం అయినా.. వారం మధ్యలో పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి. వారం చివరిలో కెరీర్ గురించి మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈ రాశి కి చెందిన ఉద్యోగస్తులు ఈ వారంలో శుభవార్తలు వింటారు. వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఉన్న ఫైనాన్స్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తిని కొనుగోలుచేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
తులారాశి: ఈ వారం ఈ రాశి వారు కెరీర్ గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేందు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రతి విషయాన్ని ఓర్పు.. సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం మధ్యలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు . జాయింట్ ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయని పండితులు సూచిస్తున్నారు. .
ధనస్సురాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ వారం.. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. పాత స్నేహితులు కలవడంతో కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే అధికారులతో ఇబ్బందులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు.. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరిపై ఆధారపడకుండా.. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.గతంలో రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. ఉద్యోగస్తులు... వ్యాపారస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జాబ్ మారాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. నూతన వాహనయోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభరాశి: ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంధువులు.. మిత్రులతో విబేధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. చాలా ఓపికగా, జాగ్రత్తగా పనిచేస్తే అంతా నార్మల్‌గా ఉంటుంది. వారం మధ్యలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.. అంతా మంచే జరుగుతుంది.
మీనరాశి: ఈ వారం ఈరాశి వారికి అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వారం మధ్యలో లిక్విడ్ ఫండ్స్ పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
