తీవ్రంగా కలిచివేసింది.. గోవా అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి

తీవ్రంగా కలిచివేసింది.. గోవా అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: గోవాలో అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటనలో 25 మంది చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

కాగా, గోవా మెడికల్ కాలేజ్, హాస్పిటల్‎లో చికిత్స పొందుతున్న ఆరుగురు బాధితులను గవర్నర్ అశోక గజపతి రాజు పరామర్శించారు. అందరికీ మెరుగైన ట్రీట్​మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై సీఎస్‎తోనూ మాట్లాడినట్లు చెప్పారు. మృతుల ఫ్యామిలీలకు పరిహారం ప్రకటించిన ప్రధానికి థ్యాంక్స్​ తెలిపారు