మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు: 2025 ఓటరు జాబితాకు అనుగుణంగా సవరించే మ్యాపింగ్ ప్రక్రియను జాగ్రత్తగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో డిప్యూటీ సీఈవో హుస్సేన్, ఐటీ సెక్షన్ అధికారి చిరంజీవులుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ 15 శాతం మాత్రమే అయిందని, రెండు వారాలలో 30 శాతం పూర్తి చేసి మెరుగుపరచాలని సూచించారు. ఎఈఆర్వోలు పూర్తి బాధ్యత తీసుకొని బీల్ఓలకు రోజువారి లక్ష్యాలను ఇచ్చి ప్రక్రియను స్పీడప్ చేయాలన్నారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని, కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

