
- తెలంగాణకు రానున్న జస్టిస్ ఘోష్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్జరుపుతున్న విచారణ తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాజెక్ట్అధికారులు, ఈఎన్ సీలు, రిటైర్డ్ ఈఎన్ సీలు, ఇంజనీర్లు, ఐఏఎస్అధికారులు, కాగ్ అధికారులు సహా112 మంది నుంచి స్టేట్ మెంట్లను కమిషన్ రికార్డ్ చేసింది. అధికారుల విచారణ పూర్తవడంతో.. ఇక కమిషన్తన పూర్తి స్థాయి ఫోకస్ అంతా రిపోర్ట్ పైనే పెట్టింది. ఇప్పటికే డ్రాఫ్ట్ రిపోర్టును తయారు చేసుకుంటున్న కమిషన్ చైర్మన్జస్టిస్ పినాకి చంద్రఘోష్.. పూర్తిస్థాయి నివేదికనూ ప్యారలల్‌గా ప్రిపేర్ చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.