- స్టోయినిస్ మెరుపుల్
- 17 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టిన మార్కస్
- లంకపై ఆసీస్ ఘన విజయం
పెర్త్: టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వెంటనే తేరుకుంది. సూపర్12 రౌండ్ గ్రూప్–1లో తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసి తొలి విజయం ఖాతాలో వేసుకుంది. మార్కస్ స్టోయినిస్ (18 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59* నాటౌట్) ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (17బాల్స్)తో చెలరేగడంతో మంగళవారం జరిగిన పోరులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 20 ఓవర్లలో 157/6 స్కోరు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (45 బాల్స్‌లో 2 ఫోర్లతో 40), చరిత్ అసలంక (25 బాల్స్‌లో3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్), ధనంజయ డిసిల్వ (26) రాణించారు. హోమ్ టీమ్ బౌలర్లలో హేజిల్‌వుడ్, కమిన్స్, స్టార్స్, అగర్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆసీస్ 16.3 ఓవర్లలో 158/3 స్కోరు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన స్టోయినిస్ ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాటర్‌గా వార్నర్, మ్యాక్స్‌వెల్ (18 బాల్స్‌లో)ను వెనక్కునెట్టాడు.
లంక తడబాటు
ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్లంతా కట్టుదిట్టమైన బంతులు వేయడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితం అయింది. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ కుశాల్ మెండిస్ (5) వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ నిశాంక, ధనంజయ డిసిల్వ (26) చాలాసేపు క్రీజులో ఉన్నప్పటికీ పెద్ద షాట్లు ఆడలేకపోయారు. దాంతో, సగం ఓవర్లకు లంక 63/1 మాత్రమే చేసింది. 12 ఓవర్లో వార్నర్ క్యాచ్ ద్వారా ధనంజయను ఔట్ చేసిన అగర్ రెండో వికెట్‌కు 69 పార్ట్‌నర్‌షిప్‌కు తెరదించాడు. నాలుగో నంబర్లో దిగిన చరిత్ అసలంక వచ్చీరాగానే మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో 6, 4తో ఇన్నింగ్స్‌లో చలనం తీసుకొచ్చాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే నిశాంక రనౌట్ అయ్యాడు. ఓఎండ్లో అసలంక నిలకడగా ఆడుతున్నప్పటికీ.. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. మిడిలార్డర్లో రాజపక్స (7), షనక (3) హసరంగ (1) నిరాశ పరిచారు. , కమిన్స్ వేసిన లాస్ట్ ఓవర్లో అసలంక 4,6 కొట్టగా.. చివరి బాల్‌కు చమిక కరుణరత్నె (14 నాటౌట్) ఫోర్‌తో లంక స్కోరు 150 మార్కు దాటింది.
స్టోయినిస్ తడాఖా
టార్గెట్ ఛేజింగ్‌లో మొదట ఆసీస్ కాస్త ఇబ్బంది పడింది. వార్నర్ (11)ను నాలుగో ఓవర్లో తీక్షణ పెవిలియన్ చేర్చగా.. ఆరోన్ ఫించ్ (42 బాల్స్‌లో 31 నాటౌట్) సింగిల్స్‌కే కష్టపడ్డాడు. దాంతో, తొలి ఏడు ఓవర్లకు ఆసీస్ 38/1 స్కోర్‌తో నిలిచింది. హసరంగ వేసిన ఎనిమిదో ఓవర్లో 4, 6 రాబట్టిన మిచెల్ మార్ష్ (17)ను తర్వాతి ఓవర్లో ధనంజయ ఔట్ చేయడంతో హోమ్‌టీమ్ కాస్త ఒత్తిడికి గురైంది. కానీ, హసరంగ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (23) ఫోర్, రెండు సిక్సర్లతో 19 రన్స్ రాబట్టి ప్రెజర్ తగ్గించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న మ్యాక్సీని 13వ ఓవర్లో కరుణరత్నె ఔట్ చేయడంతో లంక రేసులోకి వచ్చినట్టు అనిపించింది. ఈ టైమ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మార్కస్ స్టోయినిస్ లంక ఆశలపై నీళ్లు కుమ్మరించారు. వచ్చిన బాల్‌ను వచ్చినట్టు బౌండ్రీ అవతలకు పంపాడు. షనక బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన తను.. హసరంగ ఓవర్లో 6, 4, 6 బాదాడు. ఆపై, తీక్షణ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి 17 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. టార్గెట్ ఇట్టే కరిగిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 157/6 (నిశాంక 40, అసలంక 38 నాటౌట్, స్టార్క్ 1/23).
ఆస్ట్రేలియా: 16.3 ఓవర్లలో 158/3 (స్టోయినిస్ 59 నాటౌట్, ఫించ్ 31 నాటౌట్, ధనంజయ 1/18).