రఘువరన్ బీటెక్ కేసులో ధనుష్, ఐశ్వర్యలకు ఊరట

రఘువరన్ బీటెక్ కేసులో ధనుష్, ఐశ్వర్యలకు ఊరట

తమిళ హీరో ధనుష్(Danush), ఐశ్వర్య(Aishwarya) లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 2014లో రేలీజైన "వేలైయిల్లా పట్టదారి (Velaiyilla Pattadhari)" అనే సినిమాలో ధనుష్ సిగరెట్ తాగే సీన్ లో  పొగాకు హెచ్చరికలు సరిగా కనిపించలేదని, ఇది ఖచ్చితంగా పొగాకు, సిగరెట్ ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట ఉల్లంఘించినట్లే అవుతుందని, అందుకు గాను హీరో ధనుష్, సినిమా నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని పొగాకు నియంత్రణ సంస్థ తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

అయితే మరోవైపు ఈ కేసును రద్దు చేయాలంటూ ధనుష్, ఐశ్వర్య తరుపున కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిర్యాదులపై మద్రాస్ హైకోర్టు సోమవారం వాదనలు జరిపింది. ఇరువురి తరుపున వాదనలు విన్న న్యాయమూర్తి ఆనంద వెంకటేశ్.. కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించారు. దీంతో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసుకు తెర పడింది.