ప్రేమ, ద్రోహం, ప్రతీకారం క్యాప్షన్ తో 'మరీచిక'

ప్రేమ, ద్రోహం, ప్రతీకారం క్యాప్షన్ తో 'మరీచిక'

అందం, అభినయంతో ఆకట్టుకుంటూ... ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా, అనుప‌మ పర‌మేశ్వర‌న్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘మ‌రీచక’. తాజాగా
ఈ చిత్రానికి సంబంధించిన ఆకట్టుకునే కాన్సెప్ట్ పోస్టర్ ను మూవీ నిర్వాహకులు రిలీజ్ చేశారు. సతీష్ కాశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ అశ్విన్ కూడా ఓ ప్రధాన రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ పోస్టర్ ను గనక గమనిస్తే.. ఇందులో కేవలం పాదాలు మాత్రమే ఉన్నాయి. ఆ పాదాల ప్రతిబింబం నీళ్లల్లో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్టర్‌పై ‘ప్రేమ, ద్రోహం,  ప్రతీకారం’ అనే క్యాప్షన్ కూడా ఉండడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ప్రొడ్యూస‌ర్ :  రాజీవ్ చిక్కా
ద‌ర్శక‌త్వం :  స‌తీష్ కాశెట్టి
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, పాట‌లు :  ల‌క్ష్మీ భూపాల‌
కో ప్రొడ్యూస‌ర్ : ల‌క్ష్మీ భూపాల‌
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్ : ల‌క్ష్మీ భూప‌తి, సురేష్ ల‌డ్డునూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  విజ‌య్ శంక‌ర్ డొంక‌
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ :  అక్షిత అక్కి
సినిమాటోగ్రఫీ :  అర‌వింద్ క‌న్నాభిరాన్‌
ఎడిట‌ర్ :  జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్ డైరెక్టర్ :  విఠ‌ల్ కోస‌నం 
స్టంట్ మాస్టర్ :  డ్రాగ‌న్ ప్రకాష్
పి.ఆర్‌.ఓ:  వంశీ కాక‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్ :  అనీల్ భాను