ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

V6 Velugu Posted on Aug 04, 2021

మహబూబాబాద్:  ట్రైనీ ఎస్సైని వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో ఆయనను మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు. శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మరియు అత్యాచార ప్రయత్నం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.  చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదని.. తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్షింపబడతారని ఆయన అన్నారు. 
 

Tagged Maripeda, Telangana, mahaboobabad, SI Srinivas Reddy, Rape attempt on Trainee SI

Latest Videos

Subscribe Now

More News